Telangana Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. కొండా సురేఖ సహా మరొకరు ఔట్..? ముగ్గురు ఇన్..!
Telangana Cabinet Expansion : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎవరిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తారు.. కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారనే అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
Telangana Cabinet Expansion
Telangana Cabinet Expansion : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కడంతోపాటు.. పార్టీలో నేతలు వర్గాలు విడిపోయినట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరింత హీట్ పుట్టించాయి. సీఎం రేవంత్ పై సుస్మిత్ పటేల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ లోని కొందరు ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి ఖండించారు. మంత్రి కొండా సురేఖను వెంటనే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తన కుమార్తె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ కొండా సురేఖతోపాటు ఆమె భర్త కొండా మురళిసైతం వివరణ ఇచ్చారు.
Also Read : Sonia Gandhi Autobiography : సోనియా బుక్ వివాదం.. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల వార్.. ఇంతకీ ఆత్మకథలో ఏముంది?
మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ తమ నివేదికను ఏఐసీసీకి పంపించింది. ఇదే సమయంలో రాఖీ పండుగ రోజున కొండా సురేఖ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. దీంతో రేవంత్, కొండా ఫ్యామిలీ మధ్య వివాదం సమసిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొండా ఫ్యామిలీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని రేవంత్ పేర్కొన్నట్లు సమాచారం. దేనికైనా ఒక పరిమితి, హద్దు ఉంటుంది.. పిల్లలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తే ఊరుకుంటామా..? అంటూ రేవంత్ వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనినిబట్టి చూస్తే కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది.
మంత్రి వర్గంలో స్థానం కోసం పలువురు కాంగ్రెస్ నేతలు కొద్దికాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే, తాజాగా కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపడంతో.. వచ్చేనెల మొదటి లేదా రెండో వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొండా సురేఖ వివాదానికి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే ఏఐసీసీకి చేరింది. దీనిపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో సెప్టెంబర్ 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ కేంద్ర పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఆరోజే మంత్రి కొండా సురేఖ వ్యవహారంతోపాటు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే కొండా సురేఖతోపాటు మరొకరిని మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరో మంత్రి ఎవరనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇద్దరు లేదా ఒకరిని మంత్రివర్గం నుంచి తప్పించి.. కొత్తగా ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే.. అదే సామాజిక వర్గం నుంచి ఒకరిని కేబినెట్లోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మహేశ్ కుమార్ గౌడ్‌కు కూడా మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో పీసీసీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖల్లోనూ మార్పులు చేర్పులు జరుగుతాయని.. ఆమేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిసైతం తనవద్ద ఉన్న శాఖల్లో ఒకటిరెండు శాఖలు వదులుకోనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
