Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం.. మాజీ మంత్రికి ఛాన్స్

తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం.. మాజీ మంత్రికి ఛాన్స్

CM KCR

Updated On : August 21, 2023 / 8:06 PM IST

Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. మంగళవారం తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి(Mahender Reddy)కి కేబినెట్లో మళ్లీ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఎల్లుండి ప్రమణ స్వీకారం ఉంటుందని సమాచారం.

తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మంత్రివర్గంలో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేస్తారని తెలుస్తోంది. క్యాబినెట్ నుంచి ఎవరైనా మంత్రిని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వేదికగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధం కావడం గమనార్హం.

Bade Nagajyothi Video: ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని తెలియగానే జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి తీవ్ర భావోద్వేగం