BRS First List : నేడే విడుదల, సర్వత్రా ఉత్కంఠ.. బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించనున్న కేసీఆర్

ఆధిపత్య పోరు, విభేదాలు పక్కన పెట్టి ఎవరికి పోటీ చేసే అవకాశం దక్కినా కలిసి పని చేసుకోవాలని..BRS MLA Candidates First List

BRS First List : నేడే విడుదల, సర్వత్రా ఉత్కంఠ.. బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించనున్న కేసీఆర్

BRS MLA Candidates First List

Updated On : August 21, 2023 / 12:24 AM IST

BRS MLA Candidates First List : గులాబీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు రేపు(ఆగస్టు 21) తెరపడనుంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ రేపు (ఆగస్టు 21) మధ్యాహ్నం 12గంటల తర్వాత పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ భవన్ లో విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను 96స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. తొలి దశలో ఎవరుంటారు అనే దానిపై అభ్యర్థుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

Also Read..BRS First List : బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ.. 96 మందితో 21న రిలీజ్, కొందరు సిట్టింగ్ లకు షాక్..!

రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసుకుని ప్రజాక్షేత్రంలోకి దూకేందుకు రెడీ అవుతోంది. ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయని అంచనా వేస్తున్న కేసీఆర్.. దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య తీవ్ర విభేదాలు, ఆధిపత్య పోరు ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.

Also Read..Congress Candidates First List : తెలంగాణలో ఎన్నికల హీట్.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరుకు పార్టీ ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టింది. ఆధిపత్య పోరు, విభేదాలు పక్కన పెట్టి ఎవరికి పోటీ చేసే అవకాశం దక్కినా కలిసి పని చేసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులను ప్రకటించే ముహూర్తం దగ్గర పడుతుండటంతో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేక గళం వినిపించే నేతల సంఖ్య పెరుగుతోంది.

నిన్న, మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న భూపాలపల్లి, అంబర్ పేట్, మంథని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు సమావేశమై తమ నేతలకు మద్దతుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు.

Also Read..BJP Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్