CM KCR : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుండి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.

CM KCR
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుండి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ కడుపు నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఇతర కుటుంబసభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఏఐజి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగా ఉందని నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారని ఏఐజీ డాక్టర్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి సి.టి, ఎండోస్కోపీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఏఐజీ డాక్టర్లు వెల్లడించారు. గ్యాస్ట్రిక్ సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు వివరించారు.
Also Read..MLC Kavitha : లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు-తేల్చి చెప్పిన కవిత