Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో సునీల్‌రెడ్డి చేరికకు రూట్ క్లియర్..! రేవంత్ పిలుపుతో ఢిల్లీకి
నిజాబాద్ జిల్లా బాల్కొండ మాజీ బీఎస్పీ నేత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినుంచి ఢిల్లీకి రావాలని సునీల్ రెడ్డికి పిలుపు రావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటం ఖాయమని తెలుస్తోంది.

Mutyala Sunil Reddy
Mutyala Sunil Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తరువాత అనూహ్య రీతిలో తెలంగాణలో ఆ పార్టీ పుంజుకుంటోంది. ఇతర పార్టీల్లోని కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సకతను ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో పొంగులేటి, జూపల్లి వారి అనుచరగణంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీలను కలిసిశారు. జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. మరికొందరు నేతలు ఆ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Balkonda Constituency: బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఢీకొట్టేదెవరు.. ఈసారి హ్యాట్రిక్ కొడతారా?
నిజాబాద్ జిల్లా బాల్కొండ మాజీ బీఎస్పీ నేత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినుంచి ఢిల్లీకి రావాలని సునీల్ రెడ్డికి పిలుపు రావటంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికకు రూట్ క్లియర్ అయినట్లు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం అయిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా బాల్కొండ నియోజకవర్గంలో పోటీ చేసిన సునీల్ రెడ్డి.. రెండో స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో సునీల్ రెడ్డికి మంచి పట్టుండటంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పితే ఆ ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రేవంత్ సహా కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
Ponguleti – Jupalli : అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం: పొంగులేటి.. Updates In Telugu
బాల్కొండ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్‌కు మంచి పట్టుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగానే ఉన్నా.. వాళ్లకు మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఎదుర్కొనేంత బలం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక.. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డికూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. రేవంత్ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సునీల్ రెడ్డికి హస్తం పార్టీ నుంచి టికెట్ దక్కితే.. గట్టి పోటీ తప్పదనే చర్చ జిల్లా రాజకీయాల్లో జరుగుతుంది.