TPCC : సార్.. ప్లీజ్ రాజీనామా చేయొద్దన్న నేత.. జగ్గారెడ్డి ఏమన్నారంటే

తాను ఇకపై కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. విమర్శలు చేస్తే తట్టుకోగలను కానీ..నిందలు వేస్తే భరించలేనని, జరుగుతున్న వ్యవహారాలపై సోనియా, రాహుల్ కు లేఖ...

TPCC : సార్.. ప్లీజ్ రాజీనామా చేయొద్దన్న నేత.. జగ్గారెడ్డి ఏమన్నారంటే

Jaggareddy

Updated On : February 19, 2022 / 1:43 PM IST

MLA Jagarreddy : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంశం కాంగ్రెస్ లో కాక రేపుతోంది. అనుచరులు, కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారని టాక్ వినిపించింది. జగ్గారెడ్డి రాజీనామా చేస్తారనే తెగ ప్రచారం జరగింది. దీంతో సీనియర్లు అలర్ట్ అయ్యారు. ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. సీనియర్ నేత వీహెచ్ ఆయన ఇంటికి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి మాట్లాడుకుందామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఓ నేత జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని రాజీనామ చేయవద్దని ప్రాధేయపడ్డారు. కానీ..ఆయన కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయనతో 10tv ముచ్చటించింది.

Read More : Jagga Reddy : జగ్గారెడ్డికి బుజ్జగింపులు.. నిర్ణయంపై ఉత్కంఠ

తనతో ఉత్తమ్, వీహెచ్, బోసురాజు మాట్లాడారని తెలిపారు. తాను ఇకపై కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. విమర్శలు చేస్తే తట్టుకోగలను కానీ..నిందలు వేస్తే భరించలేనని, జరుగుతున్న వ్యవహారాలపై సోనియా, రాహుల్ కు లేఖ రాస్తానని మరోసారి స్పష్టం చేశారు. పిలిచి మాట్లాడాల్సిన పీసీసీ చీఫ్, ఇంచార్జ్ చోద్యం చూస్తున్నారని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టు అంటూ తనపై సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. జగ్గారెడ్డి కోవర్టు అని, చెడ్డవాడినని అనడం వల్ల దూరంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇతర పార్టీల చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తానని, పార్టీ నుంచి దూరంగా జరుగుతూ…ఇండిపెండెంట్ గా ఉంటానన్నారు. ఈ సమస్యను నివారించే విధంగా ఇంచార్జ్ చర్యలు తీసుకోకపోవడం బాధగా ఉందన్నారు. తాను కష్టపడి పైకి వచ్చినట్లు జగ్గారెడ్డి తెలిపారు.

Read More : MLA Jaggareddy : జగ్గారెడ్డి దగ్గరకు వెళుతా.. అసంతృప్తి నాయకులను పీసీసీ చీఫ్ కలవాలి – వీహెచ్

తెలంగాణ రాజకీయాల్లో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్‌పై కారాలు, మిరియాలు నూరుతున్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తానికి హ్యాండిస్తారా..? పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. పార్టీకి తన వల్ల ఇబ్బంది ఉంటే తన దారి తాను చూసుకుంటానని జగ్గారెడ్డి ప్రకటించడంతో.. అసలు ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జగ్గారెడ్డి.. 2022, ఫిబ్రవరి 19వ తేదీ శనివారం పార్టీ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. ఉదయం 11గంటలకు సంగారెడ్డిలో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఆ వెంటనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో.. అనుచరులతో భేటీ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి పెరిగిపోతోంది.