Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 337 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 222 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,004కి తగ్గింది.

Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

Updated On : September 6, 2022 / 11:56 PM IST

Telangana Corona News : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 11వేల 632 మందికి కరోనా పరీక్షలు చేయగా, 141 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 59 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 337 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 222 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,004కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణ కరోనా బులెటిన్..