DGP Mahender Reddy Retire : నేడు డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ.. కొత్త పోలీస్ బాస్ గా అంజనీకుమార్
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఇవాళ్టితో ముగియనుంది. మహేందర్ రెడ్డి నేడు పదవీ విరమణ చేయనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు.

DGP
DGP Mahender Reddy Retire : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ఇవాళ్టితో ముగియనుంది. మహేందర్ రెడ్డి నేడు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో పదవీ విరమణ ఉత్సవ పెరేడ్ జరుగనుంది. మహేందర్ రెడ్డి ఐపీఎస్ గా 36 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలు అందించారు.
పోలీస్ శాఖలో సాంకేతికతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మావోయిజం నియంత్రణకు విశేష కృషి చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డికి తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలుకనున్నారు.
Maoist Usha rani surrender : డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఆలూరి ఉషారాణి
తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఇన్ చార్జ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లక్డీకపూల్ లోని డీజీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగనుంది. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.