తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్స్…ఉచితంగా వైద్య పరీక్షలు

తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్స్…ఉచితంగా వైద్య పరీక్షలు

Updated On : January 22, 2021 / 2:44 PM IST

Telangana Diagnostic Hubs : సామాన్యులకు అందుబాటులోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాగ్నోస్టిక్ మినీ హబ్‌లు తీసుకొచ్చింది. శుక్రవారం హైదరాబాద్ లో 8 హబ్‌లను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రారంభించారు. లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట, బార్కస్‌, జంగంపేట, పానీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండిలో మినీ హబ్‌లు ఏర్పాటు చేశారు.

మినీ హబ్‌లలో రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, రేడియాలజీ పరీక్షలు చేయనున్నారు. సామాన్యులకు వైద్య పరీక్షల ఖర్చులు తగ్గనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రూపాయి ఖర్చు కాకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

బస్తీ దవాఖానాలు రిఫర్ చేస్తేనే డయాగ్నస్టిక్ సెంటర్లలో ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. హైదరాబాద్ కే పరిమితం కాకుండా జిల్లాలకు డయాగ్నస్టిక్ సెంటర్లను విస్తరిస్తామన్నారు.