Letter To KRMB : కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మరో లేఖ

శ్రీశైలం ఎడమగట్టుకాల్వ పనులను గెజిట్‌ నోటిఫికేషన్‌లో రెండుగా చూపడంపై అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు మరో లేఖ రాశారు.

Letter To KRMB : కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మరో లేఖ

Krmb

Updated On : December 24, 2021 / 7:26 AM IST

ENC Muralidhar letter to KRMB : కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ మరోసారి లేఖ రాశారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ రెండు కాంపోనెంట్లు.. ఒకే కాంపోనెంటుకు చెందినవని లేఖలో పేర్కొన్నారు. అయితే రెండవ కాంపోనెంట్‌లో 10 టిఎంసీలు అదనంగా వాడుతున్నట్లుగా ఉందని.. అది సరి కాదన్నారు. పెరిగిన ఆయకట్టుకు తగినంతగా 30 టిఎంసీల నుండి 40 టిఎంసిలుగా ప్రభుత్వం నీటి కేటాయింపు చేసిందని.. అంతే తప్ప కొత్త కాంపోనెంటు కాదని పేర్కొన్నారు.

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్‌ నోటిఫికేషన్‌లో రెండుగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ ఎస్‌ఎల్‌బీసీ అంశాన్ని ప్రస్తావించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో రెండు కాంపొనెంట్లుగా చూపారన్న ఆయన.. 10 టీఎంసీల పనులను అదనంగా చూడరాదని పేర్కొన్నారు.

Thirumala : నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

SLBCకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వం ఆయకట్టును 3 నుంచి 4లక్షల ఎకరాలకు పెంచిందని, అయితే నీటికేటాయింపులు మాత్రం పెంచలేదని లేఖలో వివరించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని ఒకటి, రెండు షెడ్యూళ్లలో ఉన్న SLBC రెండో కాంపోనెంట్ ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు కూడా లేఖ ప్రతిని పంపారు.