Micro Houses : బైటనుంచి చూస్తే కాంక్రీటు పైపు..లోపల సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు..తెలంగాణ అమ్మాయి ప్రతిభ

Telangana Girl Launches Opods Or Micro Houses
Telangana Girl Launches OPods Or Micro Houses : హాంకాంగ్ లో పెద్ద పెద్ద్ డ్రైనేజీ పైపుల్లో ఇల్లు భలే ఆకట్టుకుందో తెలిసిందే.సైబర్ టెక్చర్ వ్యవస్థాపకులు జేమస్ లా రూపొందించిన ఈ డ్రైనేజీ పైపు ఇల్లు ఎంతగానో ఆకట్టుకుంది. దానికంటే బ్రహ్మాండమైన ఇంటికి రూప కల్పన చేసింది మన తెలంగాణ అమ్మాయి. కాంక్రీటు పైపు..లోపల సింగిల్ బెడ్ రూమ్ ఇల్లును రూపొందించిన తెలంగాణ యువ ఇంజనీర్ ప్రతిభ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. మరి ఆ కాంక్రీటు పైపులో ఇల్లు విశేషాలు తెలుసుకోవాల్సిందే.
సుదూర ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ కాంక్రీటు పైపులను ఉపయోగిస్తుంది. కానీ ఈ పైపులు కేవలం నీటిని తరలించటానికే కాదు దాంట్లో ఇల్లు కూడా నిర్మించవచ్చని నిరూపించింది తెలంగాణ అమ్మాయి. కేవలం రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు ఖర్చు పెడితే..కాంక్రీటు పైపులతో ఒకరు లేదా ఇద్దరు నివసించడానికి వీలుండే ఆవాసాలుగా తీర్చిదిద్దవచ్చని అంటోంది కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, బొమ్మకల్‌కు చెందిన యువ ఇంజినీర్ పేరాల మానసారెడ్డి.
ఓపాడ్ లేదా సూక్ష్మగృహాలుగా పిలిచే ఈ కాంక్రీటు పైపులో ఇళ్లలో ఓ బెడ్రూం, కిచెన్, హాల్‌తోపాటు బాత్‌రూం, అటకలు (సామాన్లు పెట్టుకోవటానికి వీలుగా ఉండేది) కూడా ఉండటం విశేషం. 2000 మిల్లీమీటర్ల నిడివి కలిగి ఉన్న పైపుల్లో 120 చదరపు అడుగుల బిల్ట్‌అప్ ఏరియాతో సింగిల్ బెడ్రూం ఓపాడ్‌లను ఆవిష్కరించింది మానసారెడ్డి. కాంక్రీటు పైములో అటువంటి అద్భతమైన ఇంటిని హైదరాబాద్‌లోని చెంగిచెర్లలో ఓపాడ్‌ను రూపొందించింది మానసారెడ్డి.
అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే ఈ గృహాలు 100ఏళ్లు గ్యారంటీ అంటోంది. అంతేకాదు ఈ కాంక్రీటు ఇంటిని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చని మానసారెడ్డి తెలిపారు. తన ప్రతిభకు తన తల్లే స్ఫూర్తి అని..ఒంటరి అయినాగానీ తనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ తల్లి ఇచ్చిన స్ఫూర్తితో తను ఈ ఇంటిని రూపొందించానని తెలిపింది మానస. అలాగే తనను ఎంతగానో ప్రోత్సహించిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) సహకారంతో ఈ కలను నెరవేర్చగలిగానని తెలిపింది మానస.
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో గత సంత్సరం బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తిచేసిన మానస.. ఆరునెలలపాటు జపాన్, హాంకాంగ్‌లోని పలు గృహాల నమూనాలు, స్థానికుల అవసరాలపై అధ్యయనం చేసింది. సమాజంలోని అత్యం త బలహీనవర్గాల కోసం ఓపాడ్‌ల డిజైన్‌ను రూపొందించానని చెప్పింది. వివిధ వర్గాల అభిరుచులకు తగినట్లుగా 12 డిఫరెంట్ ఓపాడ్‌ల డిజైన్లు ఉన్నాయని తెలిపింది.
రిసార్ట్‌లు, రెస్టారెంట్లు, సంచార గృహాలు, సంచార దవాఖానలు, గెస్ట్‌హౌస్‌లు, గార్డ్‌రూమ్‌లకు సంబంధించిన డిజైన్లను తయారు చేయవచ్చని తెలిపింది. కాగా..మానస రూపొందించిన ఈ పైపులో ఇల్లు దేశంలోనే మెదటిదివాటర్‌పైపులతో ఓపాడ్ నిర్మాణం మన దేశంలోనే మెదటిది కావటం విశేషం. ఆరునెలలపాటు రీసెర్చ్ చేసి వివిధ రకాల డిజైన్లతో ఇంటిని నిర్మించాననీ..కేవలం రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలిపిం
ది. దాన్ని ఈ ఇంటిని ఒకసారి నిర్మించిన తర్వాత దానిని ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చనీ..అంతేకాదు ఈ ఓపాడ్‌లోనే ఫర్నీచర్ కూడా అందిస్తున్నామనీ తెలిపింది తెలంగాణ యువ ఇంజనీరు మానసారెడ్డి.