Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘రైతు భరోసా’ డబ్బులు పడ్డాయోచ్.. కానీ, వారికి మాత్రమే..!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులు..

Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘రైతు భరోసా’ డబ్బులు పడ్డాయోచ్.. కానీ, వారికి మాత్రమే..!

Rythu Bharosa

Updated On : February 5, 2025 / 2:22 PM IST

Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులు జమ కానున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాలుగు కొత్త పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో రైతు భరోసా పథకం ఒకటి. గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల ఖాతాల్లోకి రేవంత్ రెడ్డి జమ చేశారు. అయితే, ఆరోజు సెలవు రోజు కావడంతో మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. అయితే, మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు జమ కాకపోవటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.

Also Read: Gudem Mahipal Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేల కీలక సమావేశం.. ఏం జరుగుతోందో తెలుసా?

రాష్ట్రంలో ఎకరం భూమి కలిగిన రైతులకు ఇవాళ రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు సంబంధించి మొత్తం 17.03 లక్షల రైతుల అకౌంట్లకు రైతు భరోసా నిధులు ఇవాళ జమ అవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, ఎకరంకు పైబడి పొలం కలిగిన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దశల వారిగా ఎకరం, రెండెకరాలు.. ఐదెకరాలు కలిగిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లు తెలుస్తుంది.

 

‘రైతు భరోసా’ పేరుతో పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. ఏడాదికి ఎకరాకు రూ.12వేలు రెండు దఫాలుగా పంపిణీ చేయనుంది. ప్రస్తుతం తొలి విడత సొమ్ము కింద ఎకరాకు రూ.6వేలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే, తొలుత ఎకరం పొలం కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. దశల వారిగా మార్చి 31లోగా అర్హత కలిగిన ప్రతీ రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది.

 

మరోవైపు భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయంను ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం పేరుతో అందిస్తుంది. ఈ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించారు. ఈ పథకం కింద ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ, భూమిలేని వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. వీరి ఖాతాల్లో ఏడాదికి రెండు దఫాలుగా రూ.6వేల చొప్పున జమ చేయనుంది. పథకానికి శ్రీకారం చుట్టిన రోజు తొలి విడతలో 18,180 కుటుంబాల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. ఈ పథకానికి తొలిరోజున ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది.