Telangana Govt : తెలంగాణలోని రైతులకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక అంబులెన్సులు.. ఈ యాసంగి సాగుకు ఆ కష్టం తీరినట్లే..!
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు భారీ శుభవార్తను చెప్పింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.
Telangana Govt
- తెలంగాణలోని రైతులకు గుడ్‌న్యూస్
- రైతుల పొలాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ అంబులెన్సులు
- వారంలో మూడ్రోజులు ఫీల్డ్‌లోనే విద్యుత్ శాఖ అధికారులు
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు భారీ శుభవార్తను చెప్పింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కరెంట్ సమస్యలుంటే 1912 నంబరుకు సమాచారమిస్తే 24 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు.
ఏఈ, డీఈలకు ఫోన్ అక్కర్లేదు…
రైతులు ఎదుర్కొంటున్న ట్రాన్స్ ఫార్మర్ సమస్యలు, విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకే విద్యుత్ అంబులెన్సులను తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్ సంబంధిత ఏ సమస్య అయినా సరే ఏఈలు లేదా డీఈలకు నేరుగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు, సమస్య తక్షణమే పరిష్కరిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. శాసన మండలి క్వశ్చన్ అవర్‌లో సభ్యులు లేవనెత్తిన విద్యుత్ సమస్యలపై స్పందించిన భట్టి విక్రమార్క ఈ విషయాన్ని మరోసారి ప్రజలకు తెలియజేశారు. 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదు ఆటోమేటిక్‌గా నమోదవుతుంది. వెంటనే సమాచారం ఫీల్డ్‌లోని ఎలక్ట్రికల్ అంబులెన్స్ వాహనాలకు పంపిస్తాం. సిబ్బంది తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు.
వారంలో మూడ్రోజులు ఫీల్డ్‌లోనే..
రైతుల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా వారానికి మూడు రోజులు విద్యుత్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ మూడ్రోజులు అధికారులు నేరుగా రైతుల పొలాల వద్దకే వెళ్తారు. అక్కడ రైతుల సమస్యలను తెలుసుకొని, అక్కడి పరిస్థితులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని భట్టి విక్రమార్క చెప్పారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్ల విషయంపై మాట్లాడుతూ.. అదనపు విద్యుత్ లోడ్ అవసరం ఉన్న రైతులకు మాత్రమే కొత్త ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేస్తున్నామని, అవసరంలేని చోట యథేచ్ఛగా ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు.
విద్యుత్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలతో సమస్యలకు తక్షణ పరిష్కారం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో క్వశ్చన్ అవర్ సమయంలో విద్యుత్ శాఖలో చేపట్టిన ప్రగతిశీల సంస్కరణలు మరియు సమస్యల పరిష్కారానికి… pic.twitter.com/wv0Iy7osfX
— Mana Bhatti Vikramarka (@ManaBVikramarka) January 5, 2026
