Auto Fare Hike : తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపుపై.. ప్రభుత్వం కీలక ప్రకటన..
Auto Fare Hike : తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో కార్మిక సంఘాలతో భేటీ అయిన మంత్రులు పొన్నం, వివేక్ లు పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
Auto Fare Hike
Auto Fare Hike : తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరి ష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రులకు వివరించారు. వాటిపై మంత్రులు, ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు. ఈ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
Also Read : ThaTha Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్.. హరీశ్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు
2012 తర్వాత రాష్ట్రంలో ఆటో ఛార్జీల పెంపు జరగలేదని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆ ధారంగా త్వరలోనే నూతన ఛార్జీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల చిరకాల కోరికైన సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలోనే దీనిపై క్యాబినెట్లో చర్చించి, శాసనసభలో ప్రత్యేకబిల్లును ప్రవేశ పెడతామని వెల్లడించారు.
అలాగే డ్రైవర్ల కోసం ప్రమాద, సహజ మరణ బీమాతో కూడిన ఇందిరమ్మ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రైవేట్ అగ్రిగేటర్ల దోపిడీ నుంచి ఆటో డ్రైవర్లను రక్షించేందుకు ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వమే ఒక ప్రత్యేక యాప్ను రూపొందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. టీజీఎస్ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ పాలసీ తీసుకురానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
