Telangana Government: కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కాళేశ్వరం కమిషన్ ఏర్పాటునే హైకోర్టు తప్పుపట్టిందని, ఇది తమ విజయంగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని రేవంత్ సర్కార్ మండిపడింది.
Telangana Government: కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లబోతోంది తెలంగాణ సర్కార్. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. సచివాలయంలో క్యాబినెట్ సమావేశంలో పీసీ ఘోష్ నివేదిక అంశంలో హైకోర్టు తీర్పునకు సంబంధించి చర్చ జరిగింది. సుప్రీంకోర్టు తలుపు తట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో క్యాబినెట్ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లీగల్ ఇష్యూస్ పై చర్చించారు. క్యాబినెట్ లో దీనిపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఫైనల్ గా మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కుగా ఉంది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటును కూడా హైకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదు. కమిషన్ చేసిన విచారణ సెక్షన్ 8బీకి అనుసరించి జరగలేదు అనేది ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. అయితే, మొత్తంగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటునే హైకోర్టు తప్పుపట్టిందని, ఇది తమ విజయంగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని రేవంత్ సర్కార్ మండిపడింది. క్యాబినెట్ లో దీనిపై సుదీర్ఘంగా చర్చించి సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: అధిక వడ్డీ కేసులో బిగ్ ట్విస్ట్.. సింగర్ మంగ్లీ సోదరుడి వల్ల ప్రాణభయం ఉందంటూ సంచలన ఆరోపణలు..
