ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. మొదటి విడత రూ.1,00,000 ఇచ్చేది ఎప్పుడో చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మొదటి దశలో నిర్మించబోతున్న ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం..

Indiramma Housing Scheme
Indiramma Housing Scheme: అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అయితే, అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. అయితే, తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇండ్ల మంజూరిలో ప్రాధాన్యతనిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యేనాటికి ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న 71,480 మంది ఇళ్లు నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి మంజూరు చేశారు.
Also Read: CM Revanth Reddy: అందుకే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి
71,480 మందిలో ఇప్పటికే 700 మంది ఇంటి నిర్మాణం ప్రారంభించారు. వాటికి గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో జియో ఫెన్సింగ్ చేశారు. ఇళ్లకు ముగ్గు పోసుకున్న ప్రాంత ఫొటోలను, ఆక్షాంశ రేఖాంశాల ఆధారంగా వివరాలను ప్రత్యేక యాప్ లో నిక్షిప్తం చేశారు. తనిఖీకి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో ఇంటి నిర్మాణం ఉండాలి. చోటు మారితే జియో ఫెన్సింగ్ ఆధారంగా సులభంగా గుర్తిస్తారు. ఆ నిర్మాణం ఫొటో యాప్ లో క్యాప్చర్ కాదు. దీంతో అధికారులు ఆ ఇంటి నిర్మాణాన్ని అనర్హత జాబితాలో చేర్చుతారు. దీంతో తొలుత ముగ్గులు పోసిన వద్దనే ఇంటి నిర్మాణం చేసుకోవాలని అధికారులు చూసిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఇళ్లు ప్రారంభించిన వారికి తొలి విడత నగదు అందజేత విషయంపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మొదటి దశలో నిర్మించబోతున్న ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో తొలి విడత డబ్బులు జమ చేయనుంది. ఈ నెల 15 నాటికి ఈ ఇళ్లకు సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే రూ.715 కోట్ల మొత్తాన్ని సిద్ధం చేసుకుని గృహనిర్మాణ శాఖకు అందించనుంది. ఆ తరువాత వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణకు మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం 25వేల ఇళ్లు మంజూరు చేసింది. వీటి రూపంలో రూ. 375కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. మార్చి నాటికి ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.