కరోనా న్యూ స్ట్రెయిన్‌పై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌..విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా పరీక్షలు

కరోనా న్యూ స్ట్రెయిన్‌పై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌..విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా పరీక్షలు

Updated On : December 24, 2020 / 6:41 PM IST

Telangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌, లండన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను మంత్రి ఈటెల తెలుసుకుంటున్నారు. ఈనెల 9 తర్వాత ఎంతమంది బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చారు. ఎక్కడున్నారనే అంశంపై ఫోకస్‌ చేస్తున్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి కరోనా టెస్ట్‌ చేయాలని నిర్ణయించారు.

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొదటిసారి ఈ జిల్లాలోనే కరోనా వ్యాప్తి చెందడం అప్పట్లో కలకం రేపింది. బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకు వచ్చారు. అందులో 16 మంది బ్రిటన్ నుంచి వచ్చినట్టు అధికారులకు సమాచారం అందింది. బ్రిటన్ నుంచి కరీంనగర్‌కు చెందిన వారంతా ఇటీవలే స్వదేశానికి వచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు 12 మందిని ట్రేస్ చేసి వారినుంచి శాంపిల్స్ సేకరించారు. మరో నలుగురిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఇక అనుమానితులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శాంపిల్స్ ఇచ్చినవారంతా హోం క్వారంటైన్ లోనే ఉండాలని అధికారులు సూచించారు. బ్రిటన్ నుంచి వచ్చేవారిని గుర్తించే పనిలో రెండు రాష్ట్రాల అధికారులు పడ్డారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో కరోనా కొత్త స్ట్రయిన్ కలకలం రేపింది. బ్రిటన్ నుంచి రాజమండ్రి వచ్చిన మేరీ అనే మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఢిల్లీలో క్వారంటైన్ నుంచి తప్పించుకువచ్చిన మేరీ తన కుమారుడితో కలిసి రాజమండ్రికి చేరుకుంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ ఢిల్లీ వచ్చింది. అక్కడే మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. రిపోర్టులు రాకముందే క్వారంటైన్ నుంచి మహిళ తప్పించుకునిపోయింది.

ఢిల్లీ-విశాఖ స్పెషల్ ట్రైన్‌లో రాజమండ్రికి మహిళ వచ్చింది. మొబైల్ స్విచాఫ్ చేసి ఉండటంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో రాజమండ్రికి క్వారంటైన్ నుంచి తప్పించుకున్న మహిళ చేరుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. రాజమండ్రి చేరుకోగానే పోలీసులు ఆమెను గుర్తించారు. మహిళతో పాటు ఆమె కుమారుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరోనా పాజిటివ్‌తో 1800కిలోమీటర్ల వరకు ట్రైన్‌లోనే బాధిత మహిళ ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు.