కొత్త స్ట్రెయిన్‌తో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. రాష్ట్రానికి 1200 మంది..

కొత్త స్ట్రెయిన్‌తో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. రాష్ట్రానికి 1200 మంది..

Updated On : December 24, 2020 / 10:23 AM IST

Telangana govt alert on New Strain : లండన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడలేదు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ 1200 మంది వచ్చినట్టు గుర్తించారు. ఇప్పటివరకూ పరీక్షలు జరిపిన వారిలో ఎవరికీ కరోనా లేదు. మరికొందరికి కరోనా టెస్టులు జరుగుతున్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

డిసెంబర్ 9 తర్వాత రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి వచ్చినవారు లేదా యూకే మీదుగా ప్రయాణించిన వారు వివరాలు తెలపాలని ప్రభుత్వం సూచించింది. 040-24651119 నెంబర్ కు ఫోన్ చేసి తమ వివరాలను అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ భయం పట్టుకుంది.. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ ఢిల్లీ వచ్చింది. అక్కడే మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. రిపోర్టులు రాకముందే క్వారంటైన్ నుంచి మహిళ తప్పించుకునిపోయింది.

మరోవైపు కర్నాటకను కరోనా కొత్త స్ట్రెయిన్ వణికిస్తోంది. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. గత 2 వారాల్లో యూకే నుంచి కర్నాటకకు 10,500 మంది వచ్చారు.

వారిలో కొంతమందిని పరీక్షించగా ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. యూకే నుంచి వచ్చినవారిని గుర్తించే పనిలో కర్నాటక ప్రభుత్వం నిమగ్నమైంది. అనారోగ్య లక్షణాలు ఉన్నప్రతిఒక్కరిని నిశితంగా పరీక్షిస్తోంది.