ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. మారనున్న మురికివాడల రూపురేఖలు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపై వివరాలు తెలిపారు.

Indiramma Houses: తెలంగాణలోని పట్టణ ప్రాంత పేదలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జీ ప్లస్1 తరహాలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే అవకాశం ఇచ్చింది. వీటి ద్వారా మురికి వాడల రూపురేఖలు మారనున్నాయి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపై వివరాలు తెలిపారు.
చిన్న ప్లాట్లలో జీ ప్లస్ 1 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు. 400 చదరపు అడుగులలోపు స్థలంలో కార్పెట్ ఏరియా 323 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఇళ్లను నిర్మించుకోవచ్చు. (Indiramma Houses)
Also Read: కాల అమృతయోగము అంటే ఏంటి? మీకు ఉందా? రోగం వస్తే డాక్టర్లూ ఏమీ చేయలేరు.. మరి ఎలా?
పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో ఉంటున్న ప్రజలకు పక్కా ఇళ్లు ఉండేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపచేస్తున్నామని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 200 చ.అడుగులు, ఫస్ట్ ఫ్లోర్‌లో మరో 200 చ.అడుగులు నిర్మించుకునేలా జీవో జారీ చేశామన్నారు.
తమ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటిని కల్పించాలన్న ధ్యేయంతో ఈ నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. అక్కడ స్థలాల కొరత ఉంటుందని, అందుకే పలు సడలింపులు ఇచ్చామని అన్నారు.
ఇంటి నిర్మాణంలో 35.5 చ.అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి. ప్రత్యేకంగా టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలి. ఇంటి నిర్మాణం ఆర్సీసీ స్లాబ్‌తో ఉండాలి. స్ట్రక్చరల్ డిజైన్లకు డీఈఈ నుంచి పర్మిషన్ తీసుకోవాలి.