Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్… మినహాయింపులు వీటికే

Telangana Lockdown:  తెలంగాణలో లాక్‌డౌన్… మినహాయింపులు వీటికే

Telangana Lockdown

Updated On : May 11, 2021 / 6:52 PM IST

TELANGANA కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లాక్ డౌన్ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.

లాక్ డౌన్ మార్గదర్శకాలు

ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు అన్ని షాపులు తెరిచేందుకు అనుమతి
ఉదయం 6గంటల నుంచి 10వరకు ప్రజలకు అందుబాలో మెట్రో,ఆర్టీసీ
లాక్ డౌన్ లో ఏటీఎంలు,బ్యాంకులు పనిచేస్తాయి
జాతీయ రహదారులపై యథావిధిగా రవాణా కొనసాగుతుంది
ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి
వివాహాలకు 40మందికి మాత్రమే అనుమతి
అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతి
సినిమా హాళ్లు,క్లబ్ లు,జిమ్ లు,స్విమ్మింగ్ ఫూల్స్,అమ్యూజ్మెంట్ పార్కులు,స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తిగా మూసివేయబడే ఉంటాయి
వ్యవసాయ ఉత్పత్తులు,వ్యవసాయ యంత్రాలు,రైస్ మిల్లర్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు
కోల్డ్ స్టోరేజీలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు
యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు
కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి
వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి
ఉపాధి హామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి
జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి
కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు