B Parthasaradhi Reddy : బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి హైకోర్టు షాక్

B Parthasaradhi Reddy : ప్రభుత్వం నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు జీవోను కొట్టివేసింది.

B Parthasaradhi Reddy : బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి హైకోర్టు షాక్

B Parthasaradhi Reddy

Updated On : June 5, 2023 / 11:38 PM IST

B Parthasaradhi Reddy – High Court : బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్ కు భూకేటాయింపుపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయిసింధు ఫౌండేషన్ కు భూకేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం 2018లో 15 ఎకరాలు కేటాయించింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఖానామెట్ లో భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

అయితే, ప్రభుత్వం నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు జీవోను కొట్టివేసింది. భూకేటాయింపుల్లో ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా పున:పరిశీలన చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది.(B Parthasaradhi Reddy)

విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం 60ఏళ్లకు భూమిని లీజుకి ఇచ్చింది. ప్రభుత్వ జీవో ప్రకారం 60ఏళ్లకు అద్దె విలువ కోటి 47లక్షల రూపాయలుగా నిర్ణయించింది. అయితే, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇంత తక్కువకు అద్దెకు ఇవ్వడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.5వేల 344 కోట్ల గండి పడుతుందని తెలిపింది. ఇంత ఖరీదైన భూమిని ఏకపక్షంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అనేక అనుమానాలకు తావిస్తోందని హైకోర్టు సీరియస్ అయ్యింది.

Also Read..TSPSC : 15నిమిషాలు దాటితే నో ఎంట్రీ, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వరు, ఆధార్ మస్ట్.. గ్రూప్-1 పరీక్షకు TSPSC పటిష్ట చర్యలు

పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్ కు 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఈ భూమిని అలాట్ చేసింది. అయితే, సాయి సింధు ఫౌండేషన్ కి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ రైట్ టు సొసైటీ సభ్యులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఊర్మిల, సురేశ్ అనే వ్యక్తులు హైకోర్టులో దాఖలు చేసిన పిల్ పై ఇవాళ(జూన్ 5) విచారణ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం సాయి సింధు ఫౌండేషన్ కు కేటాయించిన భూకేటాయింపు జీవోని రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

దీంతో టీఆర్ఎస్ ఎంపీ, ట్రస్టీ సభ్యుడిగా ఉన్న సాయి సింధు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న పార్థసారథి రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది అని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5వేల 346 కోట్ల నష్టం వాటిల్లే విధంగా ఈ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

Also Read..Hayat Nagar: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. ఖాకీ సినిమా తరహాలో ఘటన

ఈ భూ కేటాయింపుతో ప్రభుత్వ ఖజనాకు రూ.5వేల 400 కోట్ల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా ఉంది. కేవలం రాజకీయం ప్రయోజనాల కోసమే భూములను కేటాయించారు అంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.