TSPSC : 15నిమిషాలు దాటితే నో ఎంట్రీ, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వరు, ఆధార్ మస్ట్.. గ్రూప్-1 పరీక్షకు TSPSC పటిష్ట చర్యలు

TSPSC : ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటరల్లోకి అనుమతించేదని లేదని అధికారులు తేల్చి చెప్పారు.

TSPSC : 15నిమిషాలు దాటితే నో ఎంట్రీ, మరో ఓఎంఆర్ షీట్ ఇవ్వరు, ఆధార్ మస్ట్.. గ్రూప్-1 పరీక్షకు TSPSC పటిష్ట చర్యలు

TSPSC (Photo : Google)

TSPSC – Group 1 Prelims : గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలకు TSPSC పటిష్ట చర్యలు చేపట్టింది. జూన్ 11న ఆదివారం రోజున జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు TSPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 3 లక్షల 63 వేల మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ద్వారా 503 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని TSPSC తెలిపింది. హాల్ టికెట్స్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది టీఎస్ పీఎస్ సీ.

15 నిమిషాల ముందే గేట్ క్లోజ్..
జూన్ 11న ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ మూసివేస్తామని TSPSC తెలిపింది. అంటే, ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటరల్లోకి అనుమతించేదని లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఓఎంఆర్ షీట్ ను నింపే విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓఎంఆర్ షీట్ నింపే సమయంలో ఏమైనా మిస్టేక్ చేస్తే కొత్తది ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.

Khammam : ఖమ్మంలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య.. నిప్పు అంటించుకుంది.. అసలేం జరిగింది

పెన్సిల్.. ఇంక్ పెన్.. జెల్ పెన్ వాడొద్దు..
అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్ షీట్ లో ఆన్సర్లను బబ్లింగ్ చేయాలని చెప్పారు. పెన్సిల్.. ఇంక్ పెన్.. జెల్ పెన్లతో బబ్లింగ్ చేస్తే ఆ ఓఎంఆర్ షీట్లు చెల్లవని స్పష్టం చేశారు. డబుల్ బబ్లింగ్ చేస్తే కూడా అంగీకరించేది లేదని టీఎస్ పీఎస్ సీ వెల్లడించింది. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్.. పాన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటి ఫొటోలతో కూడిన ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని చెప్పారు. ఎగ్జామ్ సెంటర్ లో పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామన్నారు.

Also Read..Hayat Nagar: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. ఖాకీ సినిమా తరహాలో ఘటన

గతేడాది అక్టోబర్‌లో గ్రూప్‌ 1 పరీక్ష జరిగింది. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. అయితే.. పేపర్ లీక్‌ వ్యవహారంతో TSPSC గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది. జూన్ 11న తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.