Group 2 Exam : గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, TSPSCకి డెడ్ లైన్

6 నెలల ముందే పరీక్షల తేదీల ఖరారయ్యాయని, కావాలనే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నారంటూ వాదించారు. Group 2 Exam Postponement

Group 2 Exam : గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, TSPSCకి డెడ్ లైన్

Group 2 Exam Postponement (Photo : Google)

Group 2 Exam Postponement : గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకుంటారో సోమవారంలోపు చెప్పాలని టీఎస్ పీఎస్ సీకి ఆదేశించింది. ఒకే నెలలో హడావుడిగా పరీక్ష నిర్వహిస్తున్నారని అభ్యర్థుల తరుపు అడ్వకేట్ వాదనలు వినిపించారు.

సోమవారంలోపే.. కోర్టు డెడ్ లైన్..
అయితే, 6 నెలల ముందే పరీక్షల తేదీల ఖరారయ్యాయని, కావాలనే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నారంటూ టీఎస్ పీఎస్ సీ అడ్వకేట్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. సోమవారం లోపు నిర్ణయం చెప్పాలంటూ టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.(Group 2 Exam)

Also Read: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా.. నరేందర్ రెడ్డే మళ్లీ సత్తా చాటతారా?

టీఎస్ పీఎస్ సీ నిర్వహిస్తున్న గ్రూప్-2 ఎగ్జామ్ ను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు అభ్యర్థులు. దీనిపై ఇరుపక్షాలు తమ తమ వాదనలు వినిపించాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఒకే నెలలో 21 పరీక్షలు..
ఒకే నెలలో ఆగస్టు 1 నుంచి 30వ తేదీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 21 పరీక్షలు ఒకే నెలలో నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా ప్రిపరేషన్ కు సరైన సమయం లేదంటూ అభ్యర్థులు వాపోయారు. ఎక్కువ పరీక్షలు ఉన్నందున అన్నింటికి హాజరయ్యే అవకాశం లేదని, చదువుకోవడానికి అస్సలు సమయం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్ -2 ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతున్నారు. 150 మంది అభ్యర్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినిపించారు. అయితే, పరీక్షల తేదీలను 6 నెలల క్రితమే ఖరారైనట్లు టీఎస్ పీఎస్ సీ వాదిస్తోంది. కేంద్ర పరీక్షలను దృష్టిలో ఉంచుకునే గ్రూప్-2 ఎగ్జామ్ డేట్స్ ను ఖరారు చేసినట్లు వెల్లడించింది.

Also Read: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అజారుద్దీన్ పోటీకి సై.. అంజ‌న్‌కుమార్ సలహాతో కంగుతిన్న అజ్జూ భాయ్!

గ్రూప్-2 పరీక్షను ఎందుకు వాయిదా వేయకూడదు?
గ్రూప్ – 2 పరీక్షను ఎందుకు వాయిదా వేయకూడదు? కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది కదా అని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పరీక్షలు రాసేందుకు ఎక్కువమందికి అవకాశం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది.

Also Read: మెక్సికో పార్సిల్, అమెజాన్ ఆర్డర్ పేర్లతో భయపెట్టి డబ్బు దోచేస్తారు.. హైదరాబాద్‌లో ఘరానా మోసం, పోలీసుల అదుపులో కన్నింగ్ గాళ్లు

ఈ నేపథ్యంలో వాయిదా ఎందుకు వేయకూడదో, పరీక్షలు వాయిదా వేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని టీఎస్ పీఎస్ సీ తరుపు అడ్వకేట్ కు సూచనలు చేసింది హైకోర్టు. అయితే, ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేయాలని, అప్పటివరకు మేము మిగతా వివరాలను సబ్మిట్ చేస్తామని టీఎస్ పీఎస్ సీ తరుపు అడ్వకేట్ అడిగారు. అయినప్పటికీ.. సోమవారం లోపే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని, పరీక్ష వాయిదాపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీఎస్ పీఎస్ సీ కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.