తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ విడుదల చేశారు.

తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ విడుదల చేశారు.
తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి అన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీ తుది గడువు. దరఖాస్తుల సమర్పణకు రూ.500 ఫైన్ తో మే 14 వ తేదీ వరకు గుడువు ఇచ్చారు. రూ.5 వేల ఫైన్ తో మే 16 వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
మే 20, 21 తేదీల్లో ఐసెట్-2020 పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొ.రాజిరెడ్డి తెలిపారు. మే 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మే 20న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. మే 21న ఉదయం మాత్రమే పరీక్ష ఉంటుందని వెల్లడించారు.
మే 14 నుంచి హాల్ టెక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మే 27న ప్రాథమిక కీ విడుదల, జూన్ 1 వరకు వినతుల స్వీకరించనున్నట్లు చెప్పారు. తెలంగాణలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో విజయవాడ, విశాఖ, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.