TS Liquor Shops : రేపటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణ
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు మంగళవారం నుంచి దరఖాస్తు స్వీకరించనున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది.
Ts Liquor Shops
TS Liquor Shops : తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు మంగళవారం నుంచి దరఖాస్తు స్వీకరించనున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ఈ నెల 18తో దరఖాస్తు గడువు ముగుస్తుంది..20న లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతుంది.
చదవండి : Maharashtra Liquor Seized : యాడికిలో భారీగా మహారాష్ట్ర మద్యం పట్టివేత
ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి 404 కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 2,620కి పెరిగింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటించింది. సోమవారం అధికారులతో సమావేశమైన ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్లకు 363 దుకాణాలు కేటాయించగా ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలను కేటాయించింది.
చదవండి : Liquor Museum : గోవాలో లిక్కర్ మ్యూజియం..ఘాటైన ’ఫెనీ‘ వెరీ స్పెషల్
ఇక ఈ మూడు కేటగిరిలకు కలిపి 756 దుకాణాలను కేటాయించినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ఇక మిగతా 1,864 జనరల్ కేటగిరి కింద ఉన్నాయి.
