Telangana Bus Services : తెలంగాణలో రేపటి నుంచి బస్సు, మెట్రో సర్వీసులు
ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో బస్సు, మెట్రో సర్వీసులు తిరగనున్నాయి. అన్ని వేళల్లో బస్సు సర్వీసులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఇంటర్ స్టేట్ సర్వీసులపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సు నడపాలనే ఆలోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది.

Tsrtc, Metro
Telangana Ends Lockdown : తెలంగాణ ప్రజలకు లాక్‌డౌన్ నుంచి విముక్తి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కరోనా కేసులతో పాటు పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గడంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది. 2021, జూన్ 19వ తేదీ శనివారం కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించింది. వైద్య శాఖ ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించింది.
మే 12 ఉదయం 10 గంటల నుంచి అమలులోకి వచ్చిన లాక్‌డౌన్ శనివారంతో ముగియనుంది. సెకండ్ వేవ్ విజృంభించడంతో ముందుగా ఏప్రిల్ 20 నుంచి నైట్ కర్ఫ్యూను అమలులోకి తెచ్చారు. కేసులు మరింతగా పెరగడంతో కర్ఫ్యూతో పాటు లాక్‌డౌన్ విధించింది. మొత్తం 38 రోజుల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో కరోనా నియంత్రణలోకి వచ్చింది.
దీంతో…ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో బస్సు, మెట్రో సర్వీసులు తిరగనున్నాయి. అన్ని వేళల్లో బస్సు సర్వీసులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఇంటర్ స్టేట్ సర్వీసులపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సు నడపాలనే ఆలోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది.
లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం తప్పనిసరిగా వెల్లడించింది. కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు., ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.