Telangana Covid Update : తెలంగాణాలో కొత్తగా 1,673 కోవిడ్ కేసులు
తెలంగాణాలో ఈరోజు కొత్తగా 1,673 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 330 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.

Telangana Covid
Telangana Covid Update : తెలంగాణాలో ఈరోజు కొత్తగా 1,673 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 330 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్ రికవరీరేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇంతవరకు 6,94,030 కోవిడ్ కేసులు నమోదు కాగా…. వారిలో 6,76.466 మంది కోవిడ్‌కు చికిత్స పొంది కోలుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్ తదితర కారణాలతో ఒకరు మరణించారు. దీంతో ఇంతవరకు మరణించిన వారి సంఖ్య 4,042 కు చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఈరోజు 1,165 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123, సంగారెడ్డిలో 44, హన్మకొండలో 34 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
మరో వైపు సోమవారం నుంచి తెలంగాణలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్‌లతో పాటు, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు మాత్రమే టీకా తీసుకునేందుకు అర్హులుగా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
Also Read : Corona Cases : ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. 24 గంటల్లో ఎన్ని కేసులంటే!
బూస్టర్ డోస్ వేయించుకోటానికి ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అక్కర్లేదని….గతంలో టీకా కోసం చేసుకున్న రిజిస్ట్రేషన్ ఆధారంగా బూస్టర్ డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని, నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లైనా టీకాలు వేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 8.3లక్షల మంది 60 ఏళ్ళు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది.

Telangana Covid Cases