T. Maoist Party : హరిభూషణ్,భార‌త‌క్క‌ కరోనాతో మృతిపై క్లారిటీ ఇస్తూ..జ‌గ‌న్ లేఖ

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో బాధపడుతూ మృతి చెందాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. హ‌రిభూష‌ణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు.

T. Maoist Party : హరిభూషణ్,భార‌త‌క్క‌ కరోనాతో మృతిపై క్లారిటీ ఇస్తూ..జ‌గ‌న్ లేఖ

T. Maoist Party

Updated On : June 24, 2021 / 3:13 PM IST

Maoist Haribhushan and bharathakka death : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో బాధపడుతూ మృతి చెందాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. హ‌రిభూష‌ణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. హరిభూషణ్ తో పాటు మరో మావోయిస్టు సారక్క అలియాస్ భారతక్క కూడా మృతి చెందారని నిర్ధారిస్తూ లేఖలో పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో చనిపోయారని లేఖలో పేర్కొన్నారు.

కగా హరిభూషణ్ గత కొంతకాలంగా బ్లాంకైటిస్ ఆస్తమాతో బాధపడుతున్నాడని..పరిస్థితి విషమించడంతో జూన్ 21,2021 ఉదయం 9గంటలకు మృతి చెందాడని..అలాగే భారతక్క జూన్ 22 ఉదయం 9:50గంటలకు మృతి చెందిందని లేఖలో వెల్లడించారు. వీరి అంత్యక్రియలను మంగళవారం ప్రజల సమక్షంలో 22న సంస్మరణ సభ జరిపి..నేతలకు శ్రద్ధాంజలి ఘటించామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ వెల్లడించారు. దీంతో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ మృతి వార్తపై పూర్తి అధికారిక స్పష్టత వచ్చింది.