తెలంగాణలో కరోనా ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ మాటేంటి?

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను నియంత్రించాలని.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైతం లాక్ డౌన్ ప్రకటించినా.. నిత్యావసర వస్తువులు, సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి. అత్యవసర సేవల విభాగంలో పనిచేసే వారు (పోలీసు సిబ్బంది మీడియా, హాస్సిటల్స్, మెడికల్ స్టోర్స్) పనిచేసే ఉద్యోగులైతే తప్పనిసరిగా బయటకు రావాలి.
ఇతర రాష్ట్రాల నుంచి రవాణా బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఇంధనం గురించి వెహికల్ ఓనర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎలాంటి భయాలు అవసరం లేదని పెట్రోల్, డీజిల్ గతంలో లాగే ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ వినోద్ వెల్లండించారు.
రాష్ట్ర వాహనదారులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. మొత్తం 3 వేలకు పైగా ఔట్‌లెట్స్ ఉండటంతో ఆందోళన పడాల్సిన అవసర్లేదని తెలిపారు. నిత్యవసర సేవలు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లోనే మాటిచ్చారు.
రెండు రాష్ట్రాల్లోనూ మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు దారులకు 12 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. ఈ తెల్లరేషన్ కార్డుదారులకు రూ.1500 వరకు ఆర్థిక సాయం అందిస్తామని కూడా సీఎం కేసీఆర్ తెలిపారు.
అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదన్నారు. 20 శాతం ఉద్యోగులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతారని తెలిపారు.
See Also | ఎంతో గొప్ప ఆలోచన: మనసున్న మారాజు ప్రకాష్ రాజ్