తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఆన్ లైన్ ద్వారా ఆహార పధార్థాల సరఫరా నిషేధం

తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఆన్ లైన్ ద్వారా ఆహార పధార్థాల సరఫరా నిషేధం

Updated On : June 21, 2021 / 2:52 PM IST

తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపింది. ఆన్ లైన్ ద్వారా ఆహార పధార్థాల సరఫరాను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. మతపరమైన ప్రదేశాలన్నింటినీ పూర్తిగా మూసేయాలని, ప్రజలు గుమికూడరాదని తేల్చి చెప్పింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి వచ్చాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది. రెడ్ జోన్లలో మాత్రం కఠినంగా ఆంక్షలు కొనసాగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ పనులకు పనులకు అనుమతి లభిస్తుంది.

ఐటీ సంస్థలు 50 శాతం ఉద్యోగులతో పని చేసుకోవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం విధించిన మినహాయింపులను అమలు చేయడానికి వెనుకాడుతున్నాయి. లాక్ డౌన్ ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ సమయంలో మినహాయింపులు ఇస్తే కరోనా విజృంభిస్తోందని భయపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎలాంటి మనహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పారు.

మే 7వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. మే8 తర్వాత అన్ని సేవలు పునరుద్దరిస్తామని చెప్పారు. మే5న క్యాబినెట్ చర్చ పెట్టి మరోసారి సమీక్షించి మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. నాలుగు రోజులు కష్టం ఓర్చుకుంటే సరిపోతుందని… ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదన్నారు.

మే7 వరకూ కఠినంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. పండగలు, ప్రార్థనలు ఇంటి నుంచే చేసుకోవాలన్నారు. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు ఎవరైనా సరే.. తిరుపతి, వేములవాడ, భద్రాచలం అన్నీ మూసేశారని తెలిపారు. ఓల్డ్ సిటీలోని మక్కా మసీదులో కూడా ఇద్దరే నమాజ్ చేశారని తెలిపారు. సామూహిక ప్రార్థనలకు అనుమతుల్లేవని స్ఫష్టం చేశారు. భవిష్యత్ కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

శానిటైజేషన్, పారిశుద్ధ కార్మికులు, సర్పంచులు , స్థానిక సంస్థ ప్రతినిధులు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఆరంభంలో కాస్త వెనుకబడినా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. అన్నదానాలు, నిత్యవసర సరుకుల పంపిణీ చేస్తున్నవారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.