Hyderabad : తమిళనాడు నేతను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
రుణం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో తమిళనాడు రాజకీయ నేతను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం హైదరాబాద్ తీసుకొచ్చారు.

Hyderabad
Hyderabad : రూ.300 కోట్ల రుణం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన అభియోగంపై తమిళనాడుకు చెందిన రాజకీయ నేతను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. రూ.300 కోట్లు రుణం ఇప్పిస్తానని కామినేని ఆసుపత్రి యాజమాన్యం నుంచి మూవేందర్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఎస్సార్ దేవర్, డాక్యూమెంటేషన్ ఖర్చుల కోసమని రూ.5 కోట్లు తీసుకున్నాడు.
2018 డబ్బు తీసుకున్న దేవర్.. ఆ తర్వాత లోన్ గురించి పట్టించుకోకపోవడంతో పలుమార్లు కామినేని యాజమాన్యం అతడితో మాట్లాడింది. సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులతో వెళ్లిన బృందం మంగళవారం దేవర్‌ను అదుపులోకి తీసుకోని కారైకుడి నార్త్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అక్కడ విచారణ చేపట్టి దేవర్‌ను అరెస్టు చేసి తెలంగాణకు తీసుకొచ్చారు. కాగా తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె కూటమి తరఫున తిరుచుళి నుంచి దేవర్ పోటీ చేశారు.