Telangana Police: జీవితమనేది ఒక యుద్ధం.. బీ అలర్ట్..

Telangana Police: జీవితమనేది ఒక యుద్ధం.. బీ అలర్ట్..

Telangana Police Used Mahesh Babu Dialogue For Safe Alert

Updated On : April 25, 2021 / 7:16 AM IST

Mahesh Babu Dialogue: జీవితం అనేది ఒక యుద్ధం కరోనా సమయంలో మనం నిరంతరం చెయ్యాల్సిన యుద్ధం ఎక్కువ అవుతోంది. ప్రతీరోజూ వైరస్‌తో యుద్ధం చెయ్యాల్సిన పరిస్థితి. సెకండ్ వేవ్‌లో పరిస్థితి ఇంకా చెయ్యిజారిపోయింది. కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. మాస్క్‌లు ధరించేవాళ్లు.. సోషల్ డిస్టెన్స్ పాటించేవాళ్లు తక్కువ అయిపోయారు.

పోలీసులు కూడా పరిస్థితి వివరించేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘జీవితమనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్‌జోన్‌లో పడేశాడు. బీ అలర్ట్.. మిమ్మల్ని మీరు రక్షించుకోండి..” అంటూ మహేష్ బాబు తన సినిమా బిజినెస్ మ్యాన్‌లో ఉపయోగించిన డైలాగ్‌ను పోస్ట్ చేశారు.

MaskIsMust అనే హ్యాష్ ట్యాగ్‌తో.. మహేష్ బాబును ట్యాగ్ చేస్తూ.. పోలీసులు ట్వీట్ చేశారు.