Konda Surekha Politics : రాఖీతో రచ్చకు ఎండ్‌కార్డ్! సీఎం రేవంత్, కొండా సురేఖ మధ్య గ్యాప్ సెట్ అయినట్లేనా.?
Konda Surekha Politics : రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ సీన్ ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, కొండా ఫ్యామిలీ మధ్య వివాదానికి పుల్‌స్టాప్ పడినట్లయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Konda Surekha Politics
Konda Surekha Politics : రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ సీన్ ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజులుగా సీఎం రేవంత్ పర్యటనలకు, ఆ మాటకొస్తే క్యాబినెట్ మీటింగ్‌కు కూడా దూరంగా ఉంటూ వచ్చిన కొండా సురేఖ..సీఎం రేవంత్ అపాయింట్మెంట్ అడిగి మరి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. ప్రత్యేకంగా సీఎం కోసం చేయించిన బంగారు రాఖీని ఆయనకు కట్టి..స్వీట్లు తినిపించారు. తనతో పాటు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరిపై సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉండాలని సురేఖ చెప్పుకొచ్చారు. మూడేళ్లుగా రేవంత్ అన్నకు రాఖీలు కడుతూ వస్తున్నానని చెప్పిన సురేఖ.. వివాదంపై స్పందించాలని కోరగా.. నో పాలిటిక్స్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు.
Also Read : Gold Silver Price Today : మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి రేట్లు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?
పరకాల కాంగ్రెస్ టికెట్ వివాదం..సీఎం రేవంత్ రెడ్డిపై కొండా కూతురు సుస్మిత వ్యాఖ్యలతో..పెద్ద దుమారమే నడిచింది. సీఎం రేవంత్, కొండా సురేఖ మధ్య దూరం ఇంకా పెరిగింది. రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నుంచి వచ్చాక కూడా మంత్రి సురేఖ ఆయనను కలవలేదు. ఇంతలోనే పీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించాలంటూ రిపోర్ట్ ఇచ్చింది. ఇంతలో భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..తర్వాత బెంగళూరుకు వెళ్లి ఏఐసీపీ చీఫ్ మల్లికార్జున ఖర్గే భట్టి సమావేశం..తర్వాత ఇష్యూ కాస్త సందిగ్ధంలో పడ్డట్లు అయింది.
ఇదంతా ఇలా ఉండగానే రేపోమాపో సురేఖపై యాక్షన్ తీసుకుంటారని ప్రచారం నడిచింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనను ముగించుకొని రాగానే..ముఖ్యనేతలతో భేటీ అయి..కొండా విషయంలో కీలక డెసిషన్ తీసుకుంటారని చెప్పుకొస్తున్నారు హస్తం నేతలు. ఈ నేపథ్యంలో రేవంత్, సురేఖ రక్షా బంధన్ సీన్‌పై పొలిటికల్ ఇంట్రెస్టింగ్గా మారింది. రాఖీ తంతుతో వారి మధ్య రాజీ కుదిరినట్లేనా.? లేక అటు సీఎం, ఇటు కొండా సురేఖ ఇద్దరూ వ్యూహాత్మకంగా వ్యవహరించారా అనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది.
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి..ఇక్కడితో వివాదానికి ఎండ్ కార్డ్ వేయాలని కొండా సురేఖ భావించారా.? కూతురు కామెంట్స్‌తో సంబంధం లేదన్న కామెంట్స్‌కు కట్టుబడి ఉండే..తన మార్క్ స్ట్రాటజీలో భాగంగానే సీఎంకు రాఖీ కట్టారా అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం కూడా సురేఖకు అపాయింట్మెంట్ ఇచ్చి వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న టాక్ వినిపిస్తోంది. సురేఖకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రాఖీ పండుగ వేళ ప్రజలు, ముఖ్యంగా మహిళలకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయని సీఎం జాగ్రత్త పడ్డారని అంటున్నారు. అయితే సురేఖ కూడా ఓ మెట్టు దిగారన్న గుసగుసలు మొదలయ్యాయి.
ఎందుకంటే సీఎం పరకాల పర్యటనకు సురేఖ వెళ్లలేదు. యాదాద్రి బోర్డు ఏర్పాటు తర్వాత జరిగిన క్యాబినెట్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. సీఎం, డిప్యూటీ ఫోన్ చేసినా సురేఖ రెస్పాండ్ కాలేదని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు సీఎంను అపాయింట్మెంట్ కొరి మరీ ఇంటికెళ్లి రాఖీ కట్టడం చేస్తుంటే..కొండా సురేఖ కూడా కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోందని అంటున్నారు. ఫార్మాలిటీకి రాఖీ కట్టినట్లు కాకుండా..కొండా సురేఖ సీఎంను కూల్ చేసే స్ట్రాటజీని ప్లే చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే కొండంత రాద్దాంతం జరిగిన తర్వాత సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా అన్న డౌట్స్ వ్యక్తం అయ్యాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వడం, దాదాపు 30 నిమిషాలకు పైగా ఇద్దరు భేటీ కావడం చర్చకు దారి తీస్తోంది. రాఖీ పండగ ఇద్దరి మధ్య వివాదం సయోధ్య కుదుర్చిందనే చర్చ జరుగుతోంది.
రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కొండా మురళి కలిశారు. భేటీ తర్వాత తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ప్రకటించి..రాజీ ఫార్ములానే అప్పుడే తెరపైకి తెచ్చారన్న చర్చ జరుగుతోంది. కొండా మురళి భట్టి విక్రమార్కను కలవడం..ఆ తర్వాత భట్టి విక్రమార్క బెంగుళూరుకు వెళ్లి ఖర్గేతో భేటీ అయ్యాక ఇష్యూ ఇంకాస్త చల్లబడిందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు కొండా ఫ్యామిలీ అంశంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడొద్దని సీఎం ఆదేశాలు ఇవ్వడం, కొండా ఫ్యామిలీ కూడా సైలెంట్‌గా ఉండటంతో వివాదం సేఫ్ ల్యాండింగ్ దిశగా అడుగులు వేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే కొండా సురేఖ అంశం రాష్ట్ర పార్టీ పరిధిలో లేదంటన్నారు నేతలు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏఐసీసీకి చేరిందని అధిష్టానమే కొండా సురేఖ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. రాఖీ పండగ సందర్భంగా జరిగిన భేటీతో అంతా సెట్ అవుతుందా.? కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక సీరియస్ యాక్షన్ తీసుకుంటారా.? కొండా, సీఎం మధ్య రాజీ కుదిరినట్లేనా.? సీఎం రేవంత్ కూల్ అయిపోయారా.? అనేది అసెంబ్లీ సెషన్ స్టార్ అయితే తప్ప క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు.
