Telangana Covid Cases Updated : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.(Telangana Covid Cases Updated)

Telangana Covid Cases Updated : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు

Telangana Covid

Updated On : June 25, 2022 / 9:03 PM IST

Telangana Covid Cases Updated: తెలంగాణలో కరోనావైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా 5వ రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం 434 కేసులు, గురువారం 494 కేసులు, శుక్రవారం 493 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 496గా ఉంది. కొత్త కేసులు 500లకు చేరువ కావడం టెన్షన్ పెట్టిస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28వేల 808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 496 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 341 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 98వేల 621 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 90వేల 897 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే (3,322) 3వేల 613 పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 29వేల 084 కరోనా టెస్టులు చేయగా.. 493 మందికి పాజిటివ్ గా తేలింది.

Covid Cases In India: దేశంలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. 91వేలు దాటిన యాక్టివ్ కేసులు

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని.. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

అటు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప తేడాతో 15 వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే క్రితంరోజు 17 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. తాజాగా 16 వేల దిగువకు చేరాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి. ఇక యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతూ 90 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది.

Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..

గత 24 గంటల వ్యవధిలో 3లక్షల 63వేల 103 కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహించగా కొత్తగా 15వేల 940 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా మహారాష్ట్రలో 4వేల 205 కేసులు, కేరళలో 3వేల 981 కేసులు వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39%గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో మరో 20మంది కొవిడ్ తో మరణించారు. 24గంటల్లో మరో 12వేల 425 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.27 కోట్లు(98.58%). దేశంలో ప్రస్తుతం కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 91వేల 779 (0.21%). నిన్న ఒక్కరోజే 15,73,341 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నేటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకాల సంఖ్య 196.94 కోట్లు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.