Covid Cases In India: దేశంలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. 91వేలు దాటిన యాక్టివ్ కేసులు

గడిచిన 24గంటల్లో 3,63,103 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15,940 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ 20 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 91,799గా నమోదైంది.

Covid Cases In India: దేశంలో కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ.. 91వేలు దాటిన యాక్టివ్ కేసులు

Covid 19

Covid Cases In India: దేశంలో కొవిడ్ వ్యాప్తి విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల కంటే గడిచిన 24గంటల్లో కోవిడ్ కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. శుక్రవారం 17,336 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా, గడిచిన 24గంటల్లో 3,63,103 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15,940 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే మరణాల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 20 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 91,799గా నమోదైంది.

దేశంలో ఇప్పటివరకు 4,33,78,234 కొవిడ్ భారిన పడ్డారు. వీరిలో 5,24,974 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. అయితే గడిచిన 24గంటల్లో కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 12,425గా ఉంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,27,61,481 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటి రేటు 4.39 శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.21 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే భారత్ లో 526 రోజులుగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 196.94 కోట్ల డోసుల టీకాలు వైద్య ఆరోగ్య శాఖ అందజేసింది. గడిచిన 24గంటల్లో 15,73,341 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 196,94,40,932 డోసుల టీకాలు అందజేశారు.

Health Benefits: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..

గడిచిన 24 గంటల్లో 3,63,103 మందికి వైద్య సిబ్బంది టెస్టులు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్ నిర్ధారణ చేసిన వారి సంఖ్య 86,02,58,139 మందికి చేరింది. దేశవ్యాప్తంగా 3387 లాబ్స్ లోకరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో 1437 ప్రభుత్వ లాబ్స్,1950 ప్రైవేట్ లాబ్స్ ఉన్నాయి.