Telangana Corona Bulletin : తెలంగాణలో కొత్తగా 73 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20వేల 666 కరోనా పరీక్షలు నిర్వహించగా, 73 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Corona Bulletin)

Telangana Corona Bulletin : తెలంగాణలో కొత్తగా 73 కరోనా కేసులు

Telangana Covid Report

Updated On : March 21, 2022 / 9:13 PM IST

Telangana Corona Bulletin : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20వేల 666 కరోనా పరీక్షలు నిర్వహించగా, 73 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో మరో 91 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో కరోనా మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,114 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 639 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111గా ఉంది. నేటివరకు రాష్ట్రంలో 3,40,18,226 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 35 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Bulletin)

China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. రెండేళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు వరుసగా రెండో రోజూ 2వేల దిగువనే నమోదవ్వడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.84లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,549 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ
అయ్యింది. పాజిటివిటీ రేటు 0.40శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో మరో 2వేల 652 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74శాతానికి చేరింది.(Telangana Corona Bulletin)

ఇక 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా మరో 31 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు తగ్గడంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 25,106 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.06శాతానికి దిగొచ్చింది.

మరోవైపు దేశంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. నిన్న మరో 2.97లక్షల మందికి టీకా అందించారు. ఇప్పటివరకు 181.24 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వారికి కూడా టీకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ వయసు వారిలో 17.99 లక్షల మంది తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!

కరోనా తీవ్రత తగ్గిందని ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ బుసలు కొడుతోంది వైరస్. పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా, దక్షిణ కొరియా దేశాల్లో పంజా విసురుతోంది. కోవిడ్ ఫోర్త్ వేవ్ హెచ్చరికలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

కరోనా కారణంగా పరిస్థితులు మళ్లీ దారుణంగా మారిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు తగ్గాయని సామాజిక దూరం, మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నారంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో కరోనా విజృంభణను ప్రస్తావిస్తూ దేశంలో పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్‌ వంటివి తప్పనిసరిగా
పాటించాలని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.