ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఉత్కంఠ.. పిటిషన్లపై విచారణకు గడువు కోరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
మరో 2 నెలలు గడువు కావాలని సుప్రీంకోర్టుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు.
 
                            
Defection MLAs: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
నేటితో గడువు ముగుస్తుండడంతో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నాం.. దీనిపై దృష్టి పెట్టాం: సీపీ సజ్జనార్
మరో 2 నెలలు గడువు కావాలని సుప్రీంకోర్టుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వగా 8 మంది మాత్రమే స్పందించారని, వీరిలో నలుగురి విచారణ మాత్రమే ముగిసిందని సుప్రీంకోర్టుకి స్పీకర్ తరపున న్యాయవాదులు తెలిపారు. మిగతా ఆరుగురి విచారణకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు.
కాగా, దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపు విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.






