Telangana Assembly : త్వరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వారం నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని భావిస్తోందని తెలుస్తోంది.

Kcr
Telangana State Assembly : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వారం నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని భావిస్తోందని తెలుస్తోంది. 2021, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని..దానికంటే ముందు…కేబినెట్ సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సమావేశాల్లో పలు బిల్లులకు ఆమోదం తెలుపనుంది.
Read More : Breakthrough Covid-19 : షాకింగ్.. బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లతో వారికి ముప్పే
ఈ క్రమంలో..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గవరన్ర్ ను కలువనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కలువనున్నారని సమాచారం. ఈ భేటీల్లో తాజాగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న అభివృధ్ధి అంశాలను గవర్నర్ కు వివరించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని 2021, సెప్టెంబర్ 09వ తేదీ గురువారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం భారత ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. ఈ పర్యటన రెండు, మూడు రోజుల వరకు మాత్రమే ఉంటుందని అందరూ భావించారు.
Read More : COVID-19 Deaths : కేరళలో వ్యాక్సిన్ వేసుకోనివాళ్లలోనే 90శాతం మరణాలు!
కానీ 9 రోజుల పాటు దేశ రాజధానిలో కేసీఆర్ ఉండడంతో రాజకీయాలు వేడెక్కాయి. పర్యటన వెనుక రాజకీయ కోణం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేయగా..అధికార పక్షం దానిని తిప్పికొట్టింది. ఢిలీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరి..అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి బిల్లులు సమర్పిస్తుంది ? తదితర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.