Police Recruitment: అభ్యర్థుల వయసు సడలింపు వివాదంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ కీలక ప్రకటన

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే నోటిఫికేషన్ లో వివరాలు పేర్కొన్నామని చెప్పింది.

Police Recruitment: అభ్యర్థుల వయసు సడలింపు వివాదంపై తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ కీలక ప్రకటన

Police Recruitment

Police Recruitment – Telangana: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ (TSLPRB Recruitment) కీలక ప్రకటన చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని తెలిపింది. అభ్యర్థుల వయసు సడలింపు వివాదం చివరి దశలో తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే నోటిఫికేషన్ లో వివరాలు పేర్కొన్నామని చెప్పింది. వయసు నిబంధనపై అందులో పేర్కొన్న విధానాన్నే అనుసరిస్తామని పేర్కొంది. వివిధ పోస్టులకు ఇప్పటికే వయసు నిబంధనపై స్పష్టత ఇచ్చామని తెలిపింది. అయితే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో వయసు నిబంధన విషయంలో పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని టెస్టులు క్వాలిఫై అయినా వయసు కారణంగా పలువురు అభ్యర్థులను తిరస్కరించినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేర్కొంది. దీనిపై ఎలాంటి వదంతులను నమ్మొద్దని స్పష్టం చేసింది. తమ బోర్డ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న అభ్యర్థుల వివరాలు చెబితే మూడు లక్షల రూపాయల రివార్డు ఇస్తామని రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు ప్రకటించారు.

Group 4 Exam : గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్లో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. కానీ.. ఇచ్చిన ఆప్షన్లలో ఒక నటుడికి బదులు మరో నటుడి పేరు