నాలుగో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్..కేసు పెట్టిన రెండో భార్య

Telangana : Suryapet సూర్యాపేట జిల్లాలో మహేశ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకుగా మారాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు జాబులో ఉండికూడా విడాకులు తీసుకోకుండా పెళ్లి మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. విడాకుల కేసు జడ్జిమెంట్ కు రాకుండానే మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య పోలీసు కేసు పెట్టింది.
కానిస్టేబుల్ కళ్యాణ వివరాలు..సూర్యాపేట జిల్లాలోని మద్దిరాల మండలానికి చెందిన రావుల మహేశ్ అలియాస్ మల్లయ్య సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2014లో మోతె మండలానికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ వారిద్దరికీ విభేదాలు రావటంతో విడాకులు తీసుకున్నారు. తరువాత మహేశ్ 2016లో 2016లో చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన స్రవంతిని మరో పెళ్లి చేసుకున్నాడు.
గర్భం దాల్చిన భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన కానిస్టేబుల్ మహేశ్ ఆమెను తరచూ వేధించేవాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక స్రవంతి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత ఆమె పండంటి మగబిడ్డను ప్రసవించింది. కానీ కొడుకుని చూడటానికి కూడా మహేశ్ వెళ్లలేదు సరికదా భార్యకు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. దీంతో స్రవంతి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు మహేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో కొనసాగుతుంది. ఈ క్రమంలో మహేశ్ ఆరు నెలల క్రితం ఓ యువతిని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయి సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు తమ కూతురు కనిపించట్లేదంటూ మిస్సింగ్ పెట్టారు.
https://10tv.in/six-constables-suspended-for-obscene-comments-on-woman-cop-up-pilibhit/
కేసు నమోదు కావడంతో.. మహేష్ యువతిని డీఎస్పీ కార్యాలయానికి తీసుకునిరాగా..పోలీసులు మహేష్‌కు, ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ యువతిని సఖి కేంద్రానికి తరలించారు. ఆ తరువాత నచ్చచెప్పి ఆ యువతి తల్లిదండ్రులు తమతో తీసుకెళ్లిపోయారు.
ఆ తరువాత మహేశ్ మరో పెళ్లికి సిద్దపడ్డాడు. గత అక్టోబర్ 29న మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మహేష్ రెండో భార్య స్రవంతికి తెలిసింది. ఇలా ఎంతమందిని పెళ్లిచేసుకుంటాడు? ఈ నిత్య పెళ్లికొడుకు పెళ్లిళ్లకు అంతులేకుండా పోతోంది నాకు న్యాయం చేయకుండా పెళ్లి మీద పెళ్లి చేసుకుంటున్నాడంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు మాత్రం నీకూ..మహేశ్ కు పెళ్లి అయినట్లు..ఆ తరువాత అతను రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా ఆధారాలు చూపితేనే ఫిర్యాదు తీసుకుంటామని చెప్పటంతో ఓ ఆడకూతురు వచ్చి నాకు అన్యాయం జరిగింది అదికూడా మీ పోలీసు డిపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తి వల్ల అని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేయకుండానే సాక్ష్యాలు కావాలంటున్నారంటూ స్రవంతి ఆవేదన వ్యక్తం చేసింది.