తెలంగాణలో మొత్తం 3కోట్ల30 లక్షల ఓట్లరు.. కొత్త ఓటర్లు ఎంతమంది అంటే?

నామినేషన్ ఉపసంహరణ తరువాతరోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

తెలంగాణలో మొత్తం 3కోట్ల30 లక్షల ఓట్లరు.. కొత్త ఓటర్లు ఎంతమంది అంటే?

Telangana CEO Vikas Raj

Telangana CEO Vikas Raj : పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలకోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 1.80లక్షల సిబ్బంది అవసరం అని తెలిపారు. ఇప్పటికే వారి ట్రైనింగ్ ఇచ్చామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

 

రాష్ట్రంలో 90వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు తొమ్మిది వేలుగా గుర్తించామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత 8,58,491 ఓట్లు తొలగించామని తెలిపారు. రాష్ట్రంలో చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపి సెగ్మెంట్ మల్కాజిగిరి అని తెలిపారు. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రాసెస్ జరుగుతోందని, షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుందని వికాస్ రాజ్ చెప్పారు.

Also Read : Lok Sabha Election 2024 : రేపే లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్.. ప్రకటించిన ఈసీ

 • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ..
 • రాష్ట్రంలో మొత్తం 3కోట్ల 30లక్షల ఓటర్లు ఉంటే.. వారిలో 8లక్షల కొత్త యువ ఓటర్లు ఉన్నారు.
 • ఈసారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం ఉంటుంది.
 • నామినేషన్ ఉపసంహరణ తరువాతరోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుంది.
 • పోస్టల్ ఓటింగ్ కొత్త సాప్ట్ వేర్ ద్వారా ఈసారి నిర్వహిస్తున్నాం.
 • ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయింది.
 • ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయి. అదనంగా కూడా ఉంచాం.
 • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికకోసం అన్ని సిద్ధం చేశాం.
 • 1.5 లక్షల సిబ్బంది ఎన్నికలకోసం అవసరం పడుతారు.
 • 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.
 • 50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే పేపర్స్ ఉండాలి లేదంటే సీజ్ చేస్తాం.
 • ఫిర్యాదులు సీ – విజిల్ యాప్ లేదా 1950కి ఫిర్యాదు చేయొచ్చు.
 • రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతి సువిదా యాప్ ద్వారా తీసుకోవాలి.
 • ఏడు లక్షల ఓటర్ కరెక్షన్స్ ఎమ్మెల్యే ఎన్నికల తరువాత చేశాం.
 • చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపి సెగ్మెంట్ మల్కాజిగిరి.
 • రోడ్ షోలు సెలవు రోజుల్లోనే… రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షో లకు అనుమతి లేదు.
 • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ లు వాడటానికి లేదు.
 • ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను, స్కూల్ డ్రెస్ లకు అనుమతి లేదు.
 • మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక పై ప్రాసెస్ జరుగుతోంది, షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది.
 • బోగస్ ఓట్ల పై ఫిర్యాదుతో పాటు అధికారుల విచారణ ద్వారా ఓట్ల తొలగింపు జరిగింది.
 • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు తొమ్మిది వేలుగా గుర్తించాం.
 • సమ్మర్ లో ఎన్నికలు కాబట్టి.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.
 • 5వేల పోలింగ్ కేంద్రాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయింది.
 • తక్కువ పోలింగ్ శాతం నమోదు కు కారణంపై ఫోకస్ పెట్టాం.
 • నామినేటెడ్ పోస్టుల భర్తీ పై చెక్ చేసి క్లారిటీ ఇస్తాం
 • పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫెసిలిటీస్ గతంలో వేయించాం.