Telangana : తెలంగాణకు మరోసారి జాతీయ అవార్డుల పంట
Telangana : సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. 9 కేటగిరిల్లో 8 ఉత్తమ అవార్డులు వచ్చాయి.

Telangana (Photo : Google)
Telangana : తెలంగాణకు మరోసారి జాతీయ అవార్డుల పంట పండింది. నేషనల్ పంచాయతీ అవార్డులు-2023లో అద్భుత ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నిలిచింది. దేశంలో నెంబర్ వన్ తో పాటుగా వరుసగా 4 ఉత్తమ అవార్డులు దక్కాయి. ఎంపిక చేసిన మొత్తం 9 వివిధ కేటగిరిల్లో తెలంగాణకు 8 కేటగిరీల్లో ఉత్తమ అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను కేంద్రం త్వరలోనే రాష్ట్రానికి అందచేయనుంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లిని, ఆయన టీమ్ ని ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారాయన.(Telangana)
తెలంగాణకు వచ్చిన అవార్డుల వివరాలు:
దేశంలోనే మరోసారి తెలంగాణకు చెందిన 4 గ్రామాలు వివిధ విభాగాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి.
1. ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్
2. సరిపోను మంచినీరు అందుబాటులో ఉన్న విభాగంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల
3. సామాజిక భద్రత గల గ్రామాల విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్ పల్లి(Telangana)
4. స్నేహపూర్వక మహిళా గ్రామాల విభాగంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం అయిపూర్
5. పేదరిక నిర్మూలన, జీవనోపాధులు పెంచిన గ్రామాల విభాగంలో గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం
6. సుపరిపాలన గ్రామ పంచాయతీల విభాగంలో వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం చీమల్ దారి
7. క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్ పూర్
8. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్ రావు పేట మండలం గంభీర్ రావు పేట గ్రామం దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి.(Telangana)