TS Govt : మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. అర్ధరాత్రి వరకు వైన్స్, బార్లు ఓపెన్
మంగళవారం టీఎస్ సర్కార్ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. మద్యం దుకాణాలు,. బార్లు, స్పెషల్ ఈవెంట్స్ కు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది...

Ts Liquor Shops
Wine Shop Till Midnight : కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు..కొత్త సంవత్సరానికి ఘనంగా వెల్ కమ్ పలకడానికి ప్రజలు రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలో మద్యం బాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం దుకాణాల సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం టీఎస్ సర్కార్ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. మద్యం దుకాణాలు,. బార్లు, స్పెషల్ ఈవెంట్స్ కు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. మద్యం షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, ఈవెంట్స్, టూరిజం హోటల్స్ కు రాత్రి 1 గంట వరకు విక్రయాలు జరుపుకోవడానికి అనుమతినివ్వడం జరుగుతుందని తెలిపింది.
Read More : AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే
మాములుగా పార్టీ జరుపుకుంటే మద్యం ఉండాల్సిందేనంటారు మందుబాబులు. అదే..న్యూ ఇయర్ వస్తే..హంగామా మాములుగా ఉండదు. గ్లాసులు గల గలలాడాల్సిందే. డిసెంబర్ 31వ తేదీన మద్యం షాపులకు, బార్లకు, ఇతర వాటికి ప్రత్యేక అనుమతులు జారీ చేస్తుంటాయి. డిసెంబర్ 31, జనవరి 01వ తేదీ..ఈ రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. రాష్ట్రా ఆబ్కారీ శాఖల ఖజానా ఫుల్ గా నిండిపోతుంది. రాత్రి 11 గంటల వరకు బంద్ అయ్యే షాపులు మరో గంట పాటు మద్యం విక్రయాలు జరుపుకొనడానికి ప్రభుత్వాలు అనుమతినిస్తుంటాయి. దీంతో మందుబాబులు తెగ ఖుష్ అయిపోతుంటారు.
Read More :Best Software Jobs: 2022లో అత్యధిక జీతం అందించే “టెక్ ఉద్యోగాలు” ఇవే
కానీ..ప్రస్తుతం కరోనా..కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తెలంగాణ రాష్ట్రం కూడా పలు నిబంధనలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై కోవిడ్ ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నచోట్ల థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలు పరిశీలించాలని చెప్పింది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని… భౌతిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.