Narsing Robbery case : నార్శింగ్ దారిదోపిడీ కేసు..వెలుగులోకి వస్తున్న కరణ్ సింగ్ అరాచకాలు
నార్శింగ్ దారి దోపిడీ కేసులో నిందితుడు కరణ్ సింగ్ ఆగడాలు,అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ ను ఏర్పాటు చేసి దారి దోపిడీలకు పాల్పడటం, ఓఆర్ఆర్ కాపు కాసి దోచుకోవటం..ఎదురు తిరిగితే చంపటానికి కూడా వెనుకాడకపోవటం, ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించటం,కారు చోరీలు ఇలా ఒకటి కాదు ఎన్నో నేరాలు బయటపడుతున్నాయి.

crimes list of Karan Singh, the accused in Narsing robbery case
Narsing robbery case : నార్శింగ్ దారి దోపిడీ కేసులో నిందితుడు కరణ్ సింగ్ ఆగడాలు,అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ ను ఏర్పాటు చేసి దారి దోపిడీలకు పాల్పడటం, ఓఆర్ఆర్ కాపు కాసి దోచుకోవటం..ఎదురు తిరిగితే చంపటానికి కూడా వెనుకాడకపోవటం, ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించటం,కారు చోరీలు ఇలా ఒకటి కాదు ఎన్నో నేరాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కరణ్ సింగ్ పై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో రౌటీ షీట్ ఉంది. నార్శింగ్ దారి దోపిడీ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులపైనే కత్తులతో దాడి చేయటం..విచారణకు పోలీస్ స్టేషన్ కు పిలిస్తే ఏకంగా సీఐపైనే దాడికి యత్నించటం ఇలా కరడు కట్టిన కరణ్ సింగ్ నేరాల చిట్టాను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు పోలీసులు.
Thieves Attacked On CI In PS : నిన్న కానిస్టేబుళ్లపై దాడి..ఈరోజు పోలీస్‌స్టేషన్‌లోనే సీఐపై దాడి
జనవరి 4న రక్త మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న కిషోర్ కుమార్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపై దారి దోపిడీ దొంగలు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కిషోర్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి వెనుక ఉన్న అసలు ఘటన పోలీసుల విచారణలో బయటపడింది. కిషోర్ కుమార్ అతని స్నేహితుడు బైక్ పై వెళుతుండగా కరణ్ సింగ్ గ్యాంగ్ హిజ్రాలను లైంగికంగా వేధిస్తుండటం కిషోర్ కుమార్ కంటపడింది. దీంతో బైక్ దిగి హిజ్రాలను కాపాడటానికి యత్నించారు. దీంతో కరణ్ సింగ్ గ్యాంగ్ రెచ్చిపోయింది. కిషోర్ కుమార్ అతని స్నేహితుడిపై దాడికి దిగారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్ ప్రాణాలు కోల్పోగా అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. కరణ్ సింగ్ గ్యాంగ్ నుంచి హిజ్రాలను కాపాడటానికి వచ్చిన కిషోర్ కుమార్ అతని స్నేహితుడిపై కరణ్ సింగ్ గ్యాంగ్ దాడి చేసిందని వెల్లడైంది.
దాడిలో కిషోర్ కుమార్ అక్కడిక్కడే చనిపోగా తీవ్ర గాయాలతో కరణ్ సింగ్ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న అతని స్నేహితుడు నార్శింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం విచారణకు వెళ్లిన పోలీసులపైనే కరణ్ సింగ్ గ్యాంగ్ కత్తులతో దాడి చేయటం ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు కావటం వారిని ఆస్పత్రికి తరలించటం వంటి ఘటనలు జరిగాయి. ఈక్రమంలో శుక్రవారం (జనవరి 6,2023) మరింతమంది అనుమానితులను సీఐ నార్శింగ్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రప్పించగా నిందుతుల కుటుంబ సభ్యులు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఐపై దాడికి యత్నించారు. ఇలా కరణ్ సింగ్ గ్యాంగ్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి.
ఈ కేసు విచారణను పోలీసులకు కరణ్ సింగ్ ఆగడాలు బయటపడుతున్నాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించటం, మైనర్ గా ఉన్నప్పటినుంచే కరణ్ సింగ్ నేరాలకు పాల్పడేవాడని పోలీసులు గుర్తించారు. 10తో కలిసి గ్యాంగ్ గా ఏర్పడి దారి కాసి డబ్బుల, నగలు దోపిడీలు చేయటం ఎదిరించినవారిపై చంపటానికి కూడా వెనుకాడకపోవటం కరణ్ సింగ్ గ్యాంగ్ చేసే అరాకచాల్లో కొన్ని మాత్రమే. ఏఆర్ఆర్ పై కాపు కాసి సెక్స్ వర్కర్ల కోసం వచ్చే వారిని టార్గెట్ చేయటం ఈ గ్యాంగ్ పనిగా పెట్టుకున్నారు. అంతేకాదు ప్రేమపేరుతో అమ్మాయిలను వేధించటం అలవాటు. అత్తాపూర్ పరిధిలో కరణ్ సింగ్ పై 5 కేసులు నమోదు అయ్యాయి. ఓ రౌడీ షీటు కూడా నమోదు అయ్యింది. కరణ్ సింగ్ నేరాల చిట్టాను వెలికి తీస్తున్నారు పోలీసులు. నార్శింగ్ పీఎస్ పరిధిలో కరణ్ సింగ్ దారి దోపిడీ కేసులో విచారణ చేపట్టగా తీగ లాగితే డొంక కదిలినట్లుగా కరణ్ సింగ్ నేరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
Thieves Attacked Police : దారి దోపిడి కేసులో విచారణకు వెళ్లిన పోలీసులు.. కత్తులతో దాడి చేసిన దొంగలు