Election Commission : నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల కమిషన్ పర్యటన… రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు

ఎన్నికల ఏర్పాట్లపై సాయంత్రం తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో ఈసీ భేటీ కానుంది.

Election Commission : నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల కమిషన్ పర్యటన… రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు

Election Commission of India (1)

Election Commission Visit Telangana : తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. రాష్ట్రంలో 3 రోజుల పాటు ఎన్నికల కమిషన్ పర్యటన చేయనుంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అండ్ టీం రానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీఐ భేటీ కానుంది.

పది రాజకీయ పార్టీలకు ఈసీ ఆహ్వానం పంపింది. ఆరు జాతీయ పార్టీలు, నాలుగు రాష్ట్ర పార్టీలను ఆహ్వానించింది. జాబితాలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, టీడీపీ, వైఎస్సార్ సీపీ, ఆప్, బీఎస్పీ, సీపీఐ(ఎం), ఎన్ పీపీ ఉన్నాయి. ఎన్నికల ఏర్పాట్లపై సాయంత్రం తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.

Jamili Elections : జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదు.. జాతీయ లా కమిషన్ కీలక ప్రకటన

రేపు (బుధవారం) జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో ఈసీ భేటీ కానుంది. అక్టోబర్ 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో ఈసీ సమావేశం కానుంది. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో మూడు రోజులపాటు ఈసీ సమీక్షలు నిర్వహించనుంది.