Special Trains : సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతికి లింగంపల్లి-కాకినాడ మధ్య 14 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Special Trains : సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

Train

Updated On : December 31, 2021 / 12:22 PM IST

South Central Railway : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సంక్రాంతికి ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండుగకు లింగంపల్లి-కాకినాడ మధ్య 14 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే గురువారం (డిసెంబర్ 30, 2021) ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక రైళ్లు (జనవరి 3, 2022)వ తేదీ నుంచి (జనవరి18, 2022)వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కాకినాడ నుంచి లింగంపల్లికి ఏడు, లింగంపల్లి నుంచి కాకినాడకు ఏడు ట్రిప్పులు నడుస్తాయని జోన్ సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ పేర్కొన్నారు.

CBI Case : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సీబీఐ కేసు నమోదు

(జనవరి 9, 2022)వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని బరంపురం స్టేషన్ కు, (జనవరి10, 2022)వ తేదీన బరంపురం నుంచి సికింద్రాబాద్ కు రెండు ప్రత్యేక ట్రిప్పులు నడిపించనున్నట్లు తెలిపింది.