Food Processing Units : తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లకు ప్రాధాన్యత

జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో కనిష్టం 500ఎకరాల చొప్పున మొత్తం 10వేల ఎకరాల భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Food Processing Units : తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లకు ప్రాధాన్యత

Food (1)

Updated On : January 14, 2022 / 12:20 PM IST

priority to food processing units : తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. వీటిలో ఎక్కువగా పచ్చళ్లు, కారంపొడులు, అప్పడాలు, పోషకాహార, చిరుతిళ్ల తయారీకి సంబంధించి సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. వీరిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగా వీటిని ఏర్పాటు చేసే నిర్వాహకులకు ఖర్చులో 35 శాతం గ్రాంటుగా ప్రభుత్వం ఇవ్వనుంది. ఎక్కువగా వీటి ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాలు ఆసక్తి చూపుతుండడంతో వారికే అప్పచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Omicron : దేశంలో 5,753 ఒమిక్రాన్ కేసులు

ఇప్పటికే జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో కనిష్టంగా 500 ఎకరాల చొప్పున మొత్తం 10 వేల ఎకరాల భూముల్లో ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం TSIICని ఆదేశించింది. దీంతో భూముల గుర్తింపుపై ఇప్పటికే ఆ సంస్థ కసరత్తు ప్రారంభించింది.

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఇప్పటికే 2వేల 745 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంవత్సరం డిసెంబర్‌ లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, లక్షా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ముందుకెళుతోంది.