నోట్లో గుడ్డలు కుక్కి..యువకుడిని చావబాదారు, వీడియో వైరల్

medchal Dist : మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఈసీ నగర్ లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన లింగస్వామి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత మహిళ లింగస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరై బయటకు వచ్చాడు.
ఈ సమయంలో..ముగ్గురు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. మాట్లాడుకుందామని..కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. చర్లపల్లిలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి..కట్టి పడేశారు. అనంతరం ఇష్టమొచ్చినట్లు కొట్టారు. కర్రలతో చావబాదారు. రక్తమోడుతున్న వాళ్లు కనికరించలేదు.
అనంతరం రాత్రంతా..కారులో తిప్పుతూ..చిత్రహింసలు పెట్టారు. చివరకు..ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లారు. కొడుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారిపోయింది. విషయం తెలుసుకున్న లింగస్వామి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన వారే..ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది.