Young Man Died : కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లి.. ఆరోగ్య కేంద్రం వద్దే యువకుడు మృతి

వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లిన యువకుడు మృతి చెందారు.

Young Man Died : కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లి.. ఆరోగ్య కేంద్రం వద్దే యువకుడు మృతి

Updated On : May 12, 2021 / 7:10 PM IST

The young man died : వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లిన యువకుడు మృతి చెందారు. ఈ ఘటన భీమదేవరపల్లి మండలం ములుకనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన కందుల చిరంజీవి(35) వ్యవసాయ బావులు తవ్వే పనిచేస్తుండేవాడు. వారం రోజుల క్రితం జ్వరం వచ్చింది. మందులు వాడినా తగ్గకపోవడంతో ములుకనూర్ పీహెచ్ సీకి వెళ్లాడు. ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష కోసం నమూనా సేకరిస్తుండగా.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.

ఆసుపత్రి వైద్యాధికారి ప్రదీప్ పరీక్షించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది 108 వాహనంలో ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే మృతి చెందినట్లు వైద్యాధికారి ధ్రువీకరించారు.