తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది : మంత్రి కేటీఆర్

  • Published By: bheemraj ,Published On : November 22, 2020 / 02:39 PM IST
తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది : మంత్రి కేటీఆర్

Updated On : November 22, 2020 / 2:48 PM IST

stable government in Telangana : సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు బాగున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉంది..అందుకే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారం (నవంబర్ 22, 2020) HICCలో నిర్వహించిన బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.



ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న సంస్థలకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్న సంస్థలే బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతాయని వెల్లడించారు. పెట్టుబడి దారులతో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా..ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉంటేనే పెట్టుబడులు పెడతారని తెలిపారు.



ప్రభుత్వం భరోసా కల్పించడం వల్లే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయని వివరించారు. 6 ఏళ్లలో అనేక అంశాల్లో తెలంగాణను దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దామని తెలిపారు.



హైదరాబాద్ ఓ అద్భుత నగరమన్నారు. భౌగోళికంగా హైదరాబాద్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని తెలిపారు. ప్రపంచంలోనే పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం తెలంగాణ అన్నారు.